May 08, 2005

లేదు ఏదీ, కానిది నాది

లేదు ఏదీ, కానిది నాది


అందీ అందని ప్రతి ఆశా నాది,

అందక మానేనా నాది అన్నది;
ఊరి నోట వచ్చు మాట ఏదీ,

ఆపగలదా నా రేపు అన్నది


లేదు ఏదీ, కానిది నాది


కాలము విలువ తెలిసినదానను,
కాలముతో నే పరిగెడతాను;
కలవర పడను,కలము వీడను,
కలమేగా నా చెలిమి అన్నది


లేదు ఏదీ, కానిది నాది


నక్షత్రాలే కాంతులు జల్లగా,
మబ్బులే రాగాలు తీయగా;

అబ్బురపరిచే ప్రక్రుతి అందం,

అందిచదా నాకు త్రుప్తి అన్నది


లేదు ఏదీ, కానిది నాది


మనస్సులో ఏదో కలత ఉందని,

ఆగిపోవునా నా పయనమన్నది;

సముద్రములోని నావ వలె,

ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది


లేదు ఏదీ, కానిది నాది

2 comments:

  1. Often in the past when you said you compose poems, I thought you were being funny. But my lil sister, now I must accept that you have the spark to ignite few rusty brains like mine. Good luck. Keep going. Your poetry must accost you all times...

    ReplyDelete
  2. Often in the past when you said you compose poems, I thought you were being funny. But my lil sister, now I must accept that you have the spark to ignite few rusty brains like mine. Good luck. Keep going. Your poetry must accost you all times...

    ReplyDelete