April 09, 2005

మనిషి

మనిషిలో కరువయింది మానవత్వమేనా,

మంచి, సహనం, సద్గుణం కూడా


తనచుట్టూ చేరినది మలినమొకటేనా,

ఆకలి, బాధ, భేషజాలు కూడా


తనను నడిపించేది ధనమొక్కటేనా,

గర్వం, అహంకారం, ద్వేషాలు కూడా


మనిషన్నది మంచి పంచేది లేదా,

పంచేది తనవద్ద వున్నప్పుడేగా


రాజవ్వు, పేదవ్వు ఎందుకీ భేదాలు,

కడతేరి చేరేది ఒకచోటికేగా



2 comments:

  1. మీ ఉద్దేశ్యం అర్థమయ్యీ అర్థము అవ్వకుండా ఉంది।

    చివరి లైనులే మీ ఉద్దేశ్యము అయితే, మొదటి లైనులు సంబందములేనట్లు అనిపించినాయి

    అయినా తెలుగు బ్లాగు చదవడం సంతోషంగా ఉన్నది

    మీరు మరిన్ని తెలుగు పోష్టులు రాసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు అని ఆశిస్తున్నాను

    ReplyDelete
  2. kiran kumar: why didn't you understand the relevance of the lines? It's just an example of how a human being thinks or lives in today's world. - selfish, money-minded, caste feelings etc.

    Just an effort to provide a mirror image of today's man(/woman)in general.

    ReplyDelete