December 09, 2005

Preface to my novel

అనంత సాగరం లాంటి ఈ మహా ప్రపంచంలో ఒక నిమిత్త మాత్రురాలిని నేను. జీవితం అనే భారాన్ని మోస్తున్న ఒక ప్రాణిని నేను. సత్యం-అసత్యం,పాపం-పుణ్యం,మంచి-చెడు,గ్న్యానం-అగ్న్యానం తేడా తెలియని మూర్ఖురాలిని కాను నేను. నిష్కల్మష హ్రుదయం నాది. అయిననూ ఏదో కలత, ఎక్కడో చిన్న లోపం. దుఃఖం అనే మహాసాగరాన్ని ఈదుతున్న ఒక సగటు మనిషిని నేను. ఈ మహాసాగరంలో ఎక్కడో వెలిసే ఒక చిన్న ద్వీపం లంటిది నా సంతోషం...


నా మనసు ఒక తెరిచిన పుస్తకం అని లోకం అన్నా,అందులో ఏ మాత్రం నిజం దాగి ఉందో అది నాకే తెలుసు. నా భావాలు నా వరకే పరిమితం. నా ఆలోచనలు మరొకరి తలుపు తట్టే లోపే గాలిలో కలిసి పోవాలి. నాది విశాల హ్రుదయం. కానీ అందులో మంచికి తప్ప వేరెవరికీ చోటు లేదు. నేను ఎల్లప్పుడూ మంచి పంచేందుకు ఆశిస్తాను. నా మంచిని బయట పెట్టాలని కోరుకుంటాను. కానీ ఎప్పుడూ ఏ మంచీ నా తలుపు తట్టలేదే అని బాధ పడే ఒక సగటు మనిషిని నేను...


కారు మబ్బుల చీకటిలో ఎక్కడో చమత్కరించే కాంతి, ఆశ. నేను ఆశావాదిని. మరొకప్పుడు నిరాశావాదిని. కానీ అన్ని వేళలా ఆశావాదిని అయి ఉండాలనేదే నా కోరిక. పగటి పూట దారి చూపే వెలుగు పేరు ఆశ. రేయి వేళలో నిండు జాబిలి నుండి ఉదయించి ఆహ్లాద పరిచే వెన్నెల పేరు ఆశ. ప్రతి ఆశ నిజం కావాలని కోరుకునే ఒక సగటు మనిషిని నేను....


లోకం అనే ఒక బంగారు పింజరం లో బంధింప బడ్డ చిట్టి చిలకను నేను. చెరసాల ఎటువంటిది అయినా, అది నరకమే. రెక్కలు తెగిన పక్షిలాంటి దానను కాను. ఆ పింజరమే అడ్డుకట్ట. ఏ బాధలు, బెరుకు లేకుండా స్వేచ్ఛగా ఆకాశాన్ని అంటాలి. ఏదో సాధించాలన్న తపన. సాధించగలనన్న నమ్మకం. మరుక్షణం సాధించగలనా అన్న సందేహం. ఏనాటికి నాకు విముక్తి? ఎప్పుడు నాకు విజయం? అతి త్వరలోనే అని ధయిర్యం చెప్పుకునే ఒక సగటు మనిషిని నేను...


...సగటు మనిషిని నేను.


2 comments:

  1. sandhya,
    i do remember you. i blog whenever i feel like doing it or whenever i'm free. Ahyways,thanks. I never knew that my blog has many readers.

    ReplyDelete
  2. Sometimes I wonder!!! How can someone, who could could call something a "pucchumatta" wirte this much ;-). You know who I am :-))

    anna

    ReplyDelete