మా తెలుగు తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతి నగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతాం
జై తెలుగుతల్లీ, జై తెలుగుతల్లీ
~శంకరంబాడి సుందరాచార్య
మీరు తెలుగు లో ప్రచురించడం చాలా ఆనందదాయకం, ఇలాగే మరిన్ని తెలుగు పోష్టులు చూస్తాను అని ఆశిస్తున్నాను।
ReplyDeletehappy telugu blogging.
I added a link to your blog at http://telugubloggers.blogspot.com